Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వారు వీరు చెప్పే మాయ మాటలు నమ్మొద్దు

పాలిచ్చే బర్రెకు పచ్చగడ్డి వేస్తే పాలిస్తుంది…

దున్నపోతుకు పచ్చ గడ్డి వేస్తే పాలు ఇవ్వదు.

డోర్నకల్ అభివృద్ధి కావాలంటే రెడ్యా నాయక్ కే ఓటు వేస్తే అభివృద్ధి అవుతుంది.

ప్రజలు చాలా తెలివిగలవారు.

వారు వీరు చెప్పే మాయ మాటలు నమ్మొద్దు… రెడ్యా.

కురవి,నిజంచెపుతాం,జూలై 19:

వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజలే దేవుళ్ళు అభివృద్ధి నా ద్వేయం అంటూ ప్రజల సమస్యలు గురించి తెలుసుకుంటూ డోర్నకల్ నియోజకవర్గంలోని బుధవారం కురవి మండల పర్యటన యాత్రలో రాజోలు,బలపాల,లచ్చిపురం,లింగ్య తండా(బి) రేకులతండా గ్రామపంచాయతీ పరిధిలోని రామచంద్రపురం పర్యటనలో భాగంగా పెద్ద ఎత్తున కోలాటాలు ఆటపాటలతో గ్రామంలోని ప్రజలు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తరలి పూల వర్షంకురిపించారు.ప్రజలే దేవుళ్ళు అభివృద్ధి నా ద్వేయం అంటూ ప్రజల సమస్యలు కోసం పల్లె పల్లె పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన డోర్నకల్ శాసనసభ్యులు డి.ఎస్ రెడ్యానాయక్ కు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.బలపాల గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలు రెడ్యానాయక్ ద్వారానే అయ్యాయని గుర్తు చేశారు.సిసి రోడ్లు తారు రోడ్లు నేను ఇచ్చినవే వేరే ఎవరు ఇంతవరకు ఇవ్వలేదన్నారు.డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 50 ఇండ్లు ఇంతకుముందు మంజూరు చేశాను.మళ్లీ 50 ఇండ్లు ఇస్తాను కట్టుకుంటున్న అనే వారికి గృహ లక్ష్మీ పథకం కింద మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.పాలిచ్చే బర్రెకు పచ్చ గడ్డి వేస్తే పాలిస్తుంది,అంతేగాని దున్నపోతుకు పచ్చ గడ్డి వేస్తే పాలు ఇవ్వదని ఎమ్మెల్యే అన్నారు.అభివృద్ధి చేసే వారిని నమ్మి ఓటెయ్యండి మీ గ్రామంలోని అభివృద్ధి పనులు నా ద్వారానే అవుతాయన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇస్తున్నారు అది నిజం కాదని అన్నారు.రైతులు మూడు కాలాల పంట పండించుకోవడం జరగట్లేదని ప్రజలకు సూచించారు. తెలంగాణ ప్రజలకు 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి నచ్చట్లేదని అన్నారు.మూడు గంటలు కరెంటు ఇస్తే చాలని రేవంత్ రెడ్డి పలికిన మాటలునమ్మి మోసపోకండి అని చెప్పారు.లింగ్యా తండా గ్రామంలోని మాట్లాడుతూ… సర్పంచి రామ్ లాల్ నాయక్ ఆధ్వర్యంలో లింగ్యాతండ గ్రామ అభివృద్ధి జరుగుతుందని అన్నారు.సిసి రోడ్లు వాటర్ ట్యాంకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేనే శంకుస్థాపన చేశానని అన్నారు.గ్రామంలోని ప్రతి తండాకు వెళ్లడం జరుగుతుందని ప్రజా సమస్యలపై తెలుసుకొని వారికి పరిష్కరించేలా చూస్తానని అన్నారు.కొందరు వ్యక్తులు ఈ పర్యటనను ఆపాలని చూసిన మొండిగా ఎదురు వెళ్తానే తప్ప వెనకడుగు వేయనన్నారు.ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఏ స్థాయి నుండి వచ్చారో నాకు తెలుసు అక్రమ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకొని విర్రవీగుతున్నారన్నారు.నేను తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లపై ప్రచారం చేయకుండా చేస్తాను రాజ్యాంగంలోని ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కు ఉంటుంది,మీ సమస్య ఏదైనా నాకు చెప్పండి వాటిని పరిష్కరిస్తా అంతేగాని ఎమ్మెల్యే గో బ్యాక్ అనే ఎదురు తిరగడం పట్ల యాత్రని కొనసాగించకుండా ఆపడం వారికి మంచిని కాదని హెచ్చరించారు.ఆ సమస్య ఎలాంటిదైనా మీకు నేను తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని మోసపోవద్దని అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని అన్నారు.డోర్నకల్ మండలంలోని 450 పైచిలుకు తండాలు 40 డిగ్రీల ఎండలో కూడా లెక్కచేయకుండా ప్రజల కోసం తిరుగుతున్నాను.ఓట్ల కోసం రాలేదు నేను ప్రజా సమస్యల కోసం వస్తున్నాను ఇంకా ఐదు నెలలు ఎలక్షన్లో ఉన్నాయి.అప్పుడు వచ్చి ఓట్లు అడుగుతాను నాపై అభిమానం ఉన్నోళ్లు నాకు ఓటేస్తారని స్పష్టం చేశారు.రామచంద్రపురంలోని గ్రామపాటి అధ్యక్షులు పడిదల నారాయణ ఆధ్వర్యంలో గూగులోత్ స్వామి నాయక్,గూగులోత్ బాలాజీ,బానోత్ శంకర్ నాయక్, గూగులోత్ సుధాకర్,బానోతు వీరన్న,బానోత్ రమేష్,గంగారాప్ శ్రీనివాస్,పుప్పల వీరన్న,గుగులోత్ దయాకర్,మరపల్లి వీరన్న,పడేదెల వీరన్న,తిప్పర్తి బాబు,బానోత్ సుధాకర్,పడిదెల వెంకన్న గంగారపు కృష్ణ,పడిదల కృష్ణ,తదితరులు పాల్గొని ఎమ్మెల్యే డి.ఎస్ రెడ్యా నాయక్ కు ఘన స్వాగతం గ్రామ ప్రజలు పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రామచంద్రపురం నిరుపేద ప్రజలకు 25 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.దళిత బంధు,బతుకమ్మ ఆడేటప్పుడు సరైన దారి మార్గం లేక ఇబ్బంది పడుతున్న ఆడపడుచులకు సీసీ రోడ్డు వేసి వారికి కానుకా గా అందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ పద్మావతి రవినాయక్,జిల్లా నాయకులు పిచ్చిరెడ్డి,మండల అధ్యక్షుడు తోట లాలయ్య,రాష్ట్ర యూత్ నాయకులు గుగులోత్ రవినాయక్, సొసైటీ చైర్మన్ గార్లపాటి వెంకటరెడ్డి,మార్కెట్ డైరెక్టర్ భరద్వాజ్ రెడ్డి,మాజీ ఎంపీపీ రామచంద్రయ్య,మాజీ ఛైర్మన్ రాజు నాయక్,రాజోలు సర్పంచ్ మస్తాన్, బలపాల సర్పంచ్ ముళ్ళ ప్రమీల రమేష్,గ్రామ పార్టీ అధ్యక్షులు నామ సైదులు, సర్పంచ్ రామ్ లాల్ నాయక్,తోట రమేష్,పెద్ది వెంకన్న,యూత్ నాయకులు బాణోత్ రమేష్ (యూత్ అధ్యక్షుడు),బాణోత్ రాము,మాలోత్ సూర్య నాయక్(సోషల్ మీడియా), గణేష్,పేర్ల గణేష్,కన్నెగంటి వెంకట్ రమణ,అల్లూరి వాసు రాజు,పలు గ్రామ ఎంపీటీసీలు,టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యలు తదితరులు పాల్గొన్నారు.