సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
మహబూబాబాద్ ,టౌన్ రిపోర్టర్, జూలై 19,( నిజం న్యూస్):
వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ మీలో ఎవరైనా ఉద్యోగ ప్రయత్నం కోసం గూగుల్ లో వెతుకుతున్నారా? ఉద్యోగం కోసం మీ యొక్క ప్రొఫైల్ రెజ్యూమ్ ఆన్లైన్ లో అప్డేట్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త..!
ఒకవేళ ఇలా మీరు గూగుల్ సెర్చ్ ఎంగేజ్లో వెతికినామీ యొక్క ప్రొఫైల్ ఆన్లైన్ అప్డేట్ చేసిన లేదా మీరు గూగుల్ లో ఏదైనా సమాచారం కోసం సెర్చ్ చేసిన అట్టి వివరాలతో కొందరు మోసగాళ్లు మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా వున్నారని ఎస్పి శరత్చంద్ర పవార్ అన్నారు.
పోలీసులు సైబర్ నేరాల పట్ల ఎన్ని చర్యలు చేపడుతున్న రోజు రోజుకు సైబర్ నేరాలు మాత్రం పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికి కూడా కొంత మంది అమాయకులు చదువుకున్న యువత కూడా ఈ సైబర్ కేటుగాళ్ళ చేతిలో బలైపోతున్నారు.
వారి తల్లిదండ్రులు కష్టించి సంపాదించిన డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సైబర్ కేటుగాళ్లు యువతను టార్గెట్ చేస్తూ వారి యొక్క బలహీనతను అంచనా వేస్తూ కొత్త తరహా మోసాలకు తెరటిప్పుతున్నారు.
ఇప్పుడు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం కోసం గూగుల్ సెర్చ్ ఎంగేయిన్ లో వెతికే నిరుద్యోగ యువతను టార్గెట్ చేసుకుని ఏదో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో మీకు జాబ్ ఆఫర్ చేస్తూ వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ గా కొంత మొత్తం జమా చేయాలి అని జాబ్ ఆఫర్ లెటర్ ను కూడా సెండ్ చేస్తూ నమ్మించి ఎక్కువ మొత్తంలో డబ్బు దోచేస్తున్నారు.
ఇటీవల కేసముద్రం కి చెందిన వ్యక్తి గూగుల్ లో ఉద్యోగ ప్రయత్నం కోసం సెర్చ్ ఇంజిన్ లో వెతకగా దీన్ని ఆసరాగా చేసుకొని అనధికారిక కంపెనీ పేరుతో ఉద్యోగం ఇస్తామని ఆఫర్ ఇచ్చి నమ్మించగా సుమారు 5 లక్షలు ఇన్వెస్ట్ మెంట్ చేసి మోసపోయాడు.
మోసపోయామని గ్రహించి బాధితులు తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఎవరూ కూడా అనధికారిక వెబ్సైట్ లలో మీ యొక్క వివరాలు నమోదు చేయకండి. మీరు నమోదు చేసిన వివరాలతో ఎవరినా మిమ్మల్ని సంప్రదిస్తే తొందరపడకుండా మీ బ్యాంకు వివరాలు చెప్పకండి.
మీ యొక్క డబ్బును అపరిచిత వ్యక్తులకు డిపాజిట్ చేయకండి. మీలో ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 కి ఫోన్ చేయడం ద్వారా గానీ లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి గాని లేదా “సైబర్ క్రైమ్ పోలీసులకు గాని సమాచారం ఇవ్వండి. అని ఎస్పీ తెలిపారు.