Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పెరుగుతున్న గోదావరి.. పరవళ్ళు తొక్కుతున్న.. తాలిపేరు 

చర్ల జూలై 19 ( నిజం చెపుతాం) గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వానకు చతీష్ గడ్ లోని వాగులు వంకలు పొంగి పొరలి మధ్యతరహా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది

దీంతో అధికారుల అప్రమత్తమై ప్రాజెక్టు17 గేట్లు ఎత్తి వేసి43.441 క్యూ చెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలివేశారు దీంతో తాలి పేరు పరవల్లుతొక్కుతూ ప్రవహిస్తోంది గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.

 

రాత్రంతా కురిసిన వర్షం కారణంగా రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది వరి నారుమల్లు మునిగిపోయాయి. వరదకు పొలాల్లో గ్రామస్థులు చేపల వేట చేపట్టారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్.డా ప్రియాంక ఓలా..

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా నూతన కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఓలా అధికారులను ఆదేశించారు జిల్లాలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు

భారీ వర్షాలకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు ఏదైనా అత్యవసర సమయంలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జీరో ఎయిట్ సెవెన్ డబల్ ఫోర్ 08744_241950 కంట్రోల్ రూమ్ నెంబర్ కు కాల్ చేయాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు

గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు వర్షాల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లు అవకాశం ఉందని దాటే ప్రయత్నం చేయొద్దని ప్రమాదం పొంచి ఉన్నట్లు చెప్పారు

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాలైన చర్ల దుమ్మగూడెం మండలాలను పర్యవేక్షించ నున్నారు