Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉయ్యాలే ఉరితాడైంది

మహబూబాబాద్ బ్యూరో జులై 18 నిజం న్యూస్

ఉయ్యాలే ఉరితాడై ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మంచిర్యాల జిల్లా భీమినీ మండలం బిట్టుర్పల్లి పంచాయతీ పరిధిలోని రాజారం గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దుర్గం గణపతి, సునీత దంపతుల కుమారుడు అక్షిత్(13)కు సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో ఇంటి వద్దే ఉంచి తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు.

ఇంట్లో చీరతో కట్టిన ఉయ్యాలపై ఊగుతూ ఆడుకుంటూ ఉండగా చీర బాలుడి మెడ చుట్టూ గట్టిగా బిగుసుకోవడంతో ఊపిరి ఆడక అల్లాడిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు పత్తి చేనులో పనులకు వెళ్లిన తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు.

అనంతరం 108 వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అక్షిత్ మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో వివరాలు సేకరించి మృతదేహాన్ని మంగళవారం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్ల