Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

క్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

మహాదేవపూర్ (భూపాలపల్లి).జూలై 18 (నిజం చెబుతాం).

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. తెలంగాణ,మహరాష్ట్రలో ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు గోదావరి,ప్రాణహిత నదిలోకి వరద నీరు చేరి ప్రవహిస్తూ కాళేశ్వరం త్రివేణి సంగమంలో కలుస్తుంది.

అక్కడి నుండి ఉభయ నదుల ప్రవాహం 7.520 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్ల వద్ద నుండి మేడిగడ్డ వైపు పరుగులెడుతుంది.

దీంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 35 గేట్లు ఎత్తివేసి,నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇన్ ఫ్లో 1,62,820 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 2,10,830 క్యూసెక్కుల నీటిని 35 గేట్లు తెరిచి వదులుతున్నారు. బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.330టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కోన్నారు.

అన్నారం సరస్వతి బ్యారేజ్ కి 7,590 క్యూసెక్కుల వరద ప్రవాహం రావడంతో అన్నారం బ్యారేజ్ లో 8.08 టీఎంసీల నీటి నిల్వ చేరింది.