Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మధ్యమానేరు నాలుగు గేట్లు ఎత్తి నీటి విడుదల

రైతుల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం

మధ్యమానేరు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు వదిలిన గంగుల కమలాకర్ వినోద్ కుమార్

బోయినిపల్లి, జూలై 17 నిజం చెపుతాం;

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మానువాడ శ్రీ రాజరాజేశ్వర మద్య మానేరు వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మరియు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో 4 గేట్లు ఎత్తి 5500క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ: తెలంగాణ రాష్ట్రంలో రైతుల కన్నీటిని తీర్చిన గొప్ప మహనీయుడు ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.కాలేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి రైతు పొలం వద్దకు నీటిని చేర్చిన వ్యక్తి కెసిఆర్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గొప్ప ప్రాజెక్టుగా నిలిపి రైతుల బాధలను తరిమికొట్టారని అన్నారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ: ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కష్టపడి కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని,ఆ ప్రాజెక్టు యొక్క ఫలితాలు ఇప్పుడు ప్రజలు మరియు రైతులు కల్లారా చూస్తున్నారని,రైతు సంక్షేమమే ప్రభుత్వం ద్యేయమని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రాజెక్టులకు అత్యధిక బడ్జెట్ కేటాయించి, రైతుల సంక్షేమం కోసమే అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణకే చెందుతుందని అన్నారు.

రైతు సంక్షేమ రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారథి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రాజన్న సిరిసిల్ల జిల్లా, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కళ్యాణపు ఆగయ్య, ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, మండల జడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మద్య మానేరు ఇంజనీర్ అధికారులు, అధికారులు, పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నేతలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.