Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మెట్ట పొలాల్లో మొలిచిన చెంచల కూర .. ఎగబడుతున్న మహిళలు

చర్ల జూలై 17 (నిజం చెపుతాం) మెట్ట పొలాల్లో మహిళలు కూర్చుని పిచ్చి మొక్కలు తొలగిస్తున్నారు అనుకుంటే పొరపాటే..

వివరాల్లోకెళితే మెట్ట పొలాల్లో చిరుజల్లులకు గడ్డి. చెత్త పుట్టకుండా రైతులు దుక్కులు దున్ని సేద్యం చేశారు . దీంతో పొలాల్లో చెంచెల అనే ఆకుకూర విపరీతంగా మొలకెత్తింది.

ఆకుకూరను సేకరించేందుకు మహిళలు మెట్ట పొలాల్లో సోమవారం ఎగబడ్డారు

ఈ విషయమై (నిజం) మహిళలను అడగగా ఆకుకూరల్లో చెంచెల కూర ముఖ్యమైందని దీనిని ఇష్టపడని వారు అంటూ ఉండరని ఇది ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుందని ఈ కూర తొలకరి జల్లులకు మొలకెత్తుతుందని,  పట్టణాల్లో ఈ కూరను కుప్పలు పోసి విక్రయిస్తారని అన్నారు

బాలింతలు కూడా ఆకు కూరను తినచ్చని పిల్లలకు తల్లిపాలు లేక ఇబ్బందులు పడే వారు ఈ ఆకుకూర తినడం వలన పాలు పడే అవకాశం కూడా ఉందని ఇది ఒక వరం అని మహిళలు వివరించారు