Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కాంగ్రెస్ నేతలు

ప్రజారోగ్యం దయనీయం
౼ డాక్టర్లు లేక రోగుల అవస్థలు డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం
౼ పదకొండు మంది డాక్టర్లకు ఒక్కరే కాంట్రాక్టు డాక్టర్ విధులు నిర్వహిస్తున్న వైనం
౼ పేరుకు పెద్ద దావకాన
౼ అందని ద్రాక్షగా మారిన వైద్యం
౼ డిసిహెచ్ఓ కు ఫిర్యాదు చేసిన చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సున్నపు వసంతం
చేవెళ్ల, జూలై 17, నిజం న్యూస్ :
మానవదేహంలో అన్నీ ఉన్నా గుండె పాత్ర గుండెదే, అలాగే ఆసుపత్రిలో ఎంతమంది సిబ్బంది ఉన్నా డాక్టర్లు లేకుండా ఏ పని ముందుకు సాగదు. చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం కాంగ్రెస్ నాయకులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ తనిఖీలలో ఈ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజారోగ్యం దయనీయంగా మారిందన్నారు. ఆస్పత్రిలోని వార్డులను, పరిసరాలను పరిశీలించారు. ఆస్పత్రులకు వస్తున్న రోగుల వివరాలు, సేవల వివరాలు అడిగి తెలుసుకుని, రికార్డులను పరిశీలించారు.

పదకొండు మంది డాక్టర్లకు ఒక్కరే కాంట్రాక్టు డాక్టర్ విధులు నిర్వహించడం చూసి, డాక్టర్లు లేక రోగుల పడుతున్న అవస్థలు చూసి డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీలను చూసే గ్రైనకాలజిస్టు లేకపోవటంతో గర్భిణులు, స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం చూసి మండిపడ్డారు. మగ ఆడ వార్డులు ఒకే దగ్గర ఉన్న దృశ్యాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్పత్రి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఫార్మసిస్ట్ డాక్టర్ సరైన టైంలో రాక రోగులకు మందులు ఇవ్వలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు డిప్యూటేషన్ పై వేరు వేరు ప్రాంతాలకు వెళ్లారని తెలుసుకొని డిప్యూటేషన్ పై వెళ్లిన డాక్టర్లను తిరిగి వెంటనే రప్పించాలని సున్నపు వసంతం డిసిహెచ్ఓ తో చరవాణిలో మాట్లాడి తెలిపారు.

వారం రోజుల్లో ఆసుపత్రి పరిస్థితి మెరుగుపరచకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

అదేవిధంగా సున్నపు వసంతం మాట్లాడుతూ.. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందనంగా మారిన చేవెళ్ల ఏరియా వైద్యశాల పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ వైద్యం మాత్రం నిరుపేదలకు అందని ద్రాక్షగా మారిందన్నారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేక వైద్య సేవలు అందక ఆసుపత్రి పేరుకే కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ వైద్యం మాత్రం సబ్‌సెంటర్‌కు మించి లేదన్నారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి ఇప్పుడు దాని ఊసే ఎత్తకుండా కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.

యాబై పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే తీరుతో ముప్పై పడకల ఆసుపత్రికి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.

చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన వారిలో కాంగ్రెస్ నాయకులు డిసిసి మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి, చేవెళ్ల సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, చేవెళ్ల సొసైటీ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, టిపిసిసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల ఎంపీటీసీ సభ్యుడు గుండాల రాములు, డిసిసి ప్రధాన కార్యదర్శి పెంటయ్య గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి రెడ్డి శెట్టి మధుసూదన్ గుప్తా, చేవెళ్ల వార్డు మెంబర్ మల్గారి మల్లారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జుకన్నగారి శ్రీకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పాండు యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బి శ్రీనివాస్, సోషల్ మీడియా చేవెళ్ల నియోజకవర్గం కో కన్వీనర్ మాణిక్యం, మైనారిటీ జిల్లా కార్యదర్శి మహమ్మద్ హనీఫ్, న్యాలట మాజీ సర్పంచ్ బాలయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండారు వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.