Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జూరాల కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

వనపర్తి బ్యూరో జూలై 17 ( నిజం చెపుతాం ) వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో సోమవారం రోజు సాయంత్రం 5:30 నిమిషాల ప్రాంతంలో పెబ్బేరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన విజయ్( 21) కులం ఉప్పరి పెబ్బేరులో  ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తూ ఉన్నాడు.

ట్రాక్టర్ నెంబర్ టీఎస్ 06 ఈసీ 4275 కంచిరావుపల్లి గ్రామంలో వ్యవసాయ పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి జూరాల కాలువ లోపల పడిపోయింది.

కాలువ లోపలి నుండి అరుపులు వినిపించడంతో పక్కన ఉన్న భాను అనే వ్యక్తి కొందరి యువకులను తీసుకువెళ్లి.విజయ్ ని జూరాల కాలువలో నుండి బయటికి తీయడం జరిగింది.

పోలీసుల సహకారంతో 108 పిలిపించి వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఎస్సై జగదీశ్వర్ తెలియజేశారు.