ఓటు నమోదు పత్రాలు ఎంపీపీ రేగా కాళిక కు అందజేత

ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు త్వరలో జరగనున్న ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటు వేయడానికి ఓటు నమోదు ఫారాలు పూర్తి చేసి ఎంపీపీ రేగా కాళిక బుధవారం టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్ అందజేయడం జరిగింది.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రావుల సోమయ్య,రేగా సత్యనారాయణ పాల్గొన్నారు.