సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి
తుంగతుర్తి జులై 17 నిజం చెపుతాం న్యూస్
సూర్యాపేట పేట జిల్లా కలెక్టర్ ,సమాచార పౌరసంబంధాల శాఖ అధికారి ఆదేశాల మేరకు తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తి గ్రామంలో సీజనల్ వ్యాధులపట్ల అప్రమతంగా ఉండాలని తెలంగాణ సంస్కృతిక సారధి జిల్లా కో ఆర్డినేటర్ వేముల నరేష్ బృందం పాటల రూపంలో అవగాహన కల్పించటం జరిగిందని అన్నారు.
ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత నిర్మాణం చెయ్యాలని, భూమిమీద పడిన ప్రతి నీటిబొట్టును ఆదచెయాలని, ఈగలు, దోమలు వలకుండా మురుగు నీటిని జాము కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, తడి పొడి చెత్తను వేరుగా చేయాలనీ వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి,తెలంగాణ సంస్కృతిక సారధి బృందం సభ్యులు గంట బిక్షపతి, వేముల శ్రవణ్, ఈర్ల సాయి, మాగి శంకర్,చిప్పలపల్లి సుధాకర్, పల్స నిర్మల, నెమ్మది స్రవంతి, సిరిపంగి రాధ, ప్రియదర్శిని, ఇందిరా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.