Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రైతులు చిరుధాన్యాలను సాగు చెయ్యాలి

గడ్డిపల్లి కె వి కె ఇంచార్జ్ బి. లవకుమార్
. గరిడేపల్లి జులై 17 (నిజం చెబుతాం)కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లిలో సోమవారం నాడు 95వ ఐ సి ఏ ఆర్ వ్యవస్థాపక మరియు సాంకేతిక దినోత్సవల కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ప్రకృతి వ్యవసాయం ద్వారా చిరు ధాన్యాలు సాగు పై దృష్టి సారించాలని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త అండ్ హేడ్ బి. లవ కుమార్ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు ఎరువులు మరియు క్రిమిసంహారిక మందులు అధిక మోతాదులో వాడటం వలన ఖర్చు పెరిగి ఆదాయం తగ్గిపోతున్నదని అన్నారు.

కావున రైతులు సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ఖర్చు తగ్గి, నేల ఆరోగ్యం పెంపొందుతుందని తెలిపారు. సేంద్రియ వ్యవసాయంతో పండించే పంటకు అధిక ధర కూడా వస్తుందని తెలియజేశారు.

కెవికెలో ప్రకృతి వ్యవసాయంపై చేస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల గురించి తెలియజేశారు.కేవీకే మృతిక శాస్త్రవేత్త కిరణ్ మాట్లాడుతూ సహజ వ్యవసాయంలో పాటించ వలసిన పద్దతులు సేంద్రీయ జీవన ఎరువుల వాడకం లాభాల గురించి వివరించారు.

సమగ్ర సస్యరక్షణ పద్ధతుల వల్ల పర్యావరణానికి మేలు కలగడమే కాకుండా రైతులకు రసాయన ఎరువులు పురుగు మందులు వాడటంను చాలా వరకు తగ్గించుకోవచ్చునని తెలియజేశారు.

కేవికే శాస్త్రవేత్త డి. ఆదర్శ్ వివిధ రకాల కషాయాల ద్రావణుల తయారీ విధానం తెలిపారు. కె వి కె శాస్త్రవేత్త డి. నరేష్ చిరుధాన్యాల సాగు, వివిధ రకాల విత్తనాల ఉత్పత్తుల గురించి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు . నరేష్, డా టీ మాధురి, ఎన్.సుగంధి, కె.వి.కె ఆఫీస్ సిబ్బంది ఏ నరేశ్, రైతులు, విద్యార్థులు తదితరలు పాల్గొన్నారు.