వృద్దులకు వైద్యం చేయనంటే చేయనంటున్న వైద్యుడు
… డా వై కిరణ్ బాబు.
వారి వల్ల నా సమయం వృధా అవుతుంది.
మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, జూలై 17,నిజం న్యూస్
మానుకోట పట్టణంలో కొందరు ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు రోగులపై రోగి బంధువులపై అసభ్య పదజాలంతో దాడులు చేసే అంత పని చేస్తున్నారు.
సోమవారం తన 90 సంవత్సరాల తండ్రి అనారోగ్యంగా ఉంటే పట్టణంలోని మెడ్విన్ స్కానింగ్ సెంటర్ కు తీసుకు వెళ్లిన శ్రీనివాస్ నాయక్.
అయితే సదరు డాక్టర్ వై కిరణ్ బాబు అబ్దామ్ స్కానింగ్ తీయాలి అని చెప్పారు. తన తండ్రిని తీసుకొని స్కానింగ్ గదికి తీసుకు వెళ్ళాడు.
తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వలన అబ్డామ్ స్కానింగ్ త్వరగా చేయమని డాక్టర్ను శ్రీనివాస్ కోరారు. దానికి డాక్టర్ కిరణ్ బాబు చికాకుపడుతూ 20 మంది పేషెంట్లు ఉన్నారు మీ తండ్రి వాళ్ళ నా సమయం వృధా అవుతుంది అని వారిని చూసిన తదుపరి నీ తండ్రికి స్కానింగ్ చేస్తానని చెప్పారు.
అంత టైం తీసుకుంటే తన తండ్రి ఇబ్బంది పడతాడని డాక్టర్ను ఎంత బ్రతిమిలాడిన వినక శ్రీనివాస్ పై బూతులు తిడుతూ దాడి చేసినంత పని చేశారు.
తన రూమ్ లో ఉన్న శ్రీనివాస్ నాయక్ ను” గెటవుట్”అరేయ్ “వీడిని నా రూమ్ నుండి బయటికి గెంటేయండి రా” అని ఆవేశంగా ఊగిపోతూ, తన సిబ్బందిని ఆదేశించాడు గతంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ కూడా ఒక పత్రిక ప్రతినిధిని ఈ విధంగా గల్లా పట్టి లాగడం పెద్ద గందరగోళానికి దారితీసింది.
అయితే సదరు శ్రీనివాస్ నాయక్ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో వరంగల్ ఉమ్మడి జిల్లాల బ్యూరోగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక పాత్రికేయుడికి ఇలా జరిగిందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది. ఇలాంటి ఆవేశపరుడైన డాక్టర్ రోగులకు ఏం వైద్యం చేస్తాడు అని కొందరు రోగులు వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి ఆవేశపరుడైన డాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని అని వెంకన్న నాయక్ బాధను వ్యక్తం చేశారు.