Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రోడ్డుపై వరి నాటు వేసి నిరసన

బోయినిపల్లి, జూలై 17 నిజం చెపుతాం;

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లకుంట చెరువుకు వెళ్లే దారిలో గత ఆరు నెలల క్రితం సిమెంటు మోరి నిర్మించగా దాని ప్రక్కన రోడ్డు చిన్న చినుకుతో బురద మాయంగా మారుతుందని, రోడ్డుపై నాటు వేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే మరమ్మతులు చేపట్టాలని, బురదలో రైతులు రాత్రి వేళలో పోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు బురదలో జారి పడటంతో గాయాలైనట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ: బంగారు తెలంగాణ అని గొప్పలు చెప్పడమే తప్ప రైతుల బాధలు పట్టించుకునే పాపాన ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం లేదని, వెంటనే మొరం పోయించి రోడ్డును మరమ్మత్తు చేయించాలని లేనియెడల ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమములో ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు గుడి రాజశేఖర్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి మహమ్మద్ హుస్సేన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి రఫీ, గ్రామ అధ్యక్షుడు సింగరి కేశవరెడ్డి, మండల నరేష్, మనోజ్ రెడ్డి, తోట రవి, మహేష్, నవీన్, భీమ తిరుపతి, రైతులు బత్తిని లస్మయ్య, చేపురి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.