వెంగన్నపాలెంలో మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభం…

మండలంలోని వెంగన్నపాలెం గ్రామపంచాయతీ, లో మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణ పనులను బుధవారం సర్పంచ్ గలిగే సావిత్రి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగు నీరు అందించే కార్యక్రమంలో భాగంగా అధికారుల సమన్వయంతో పనులను త్వరగా పూర్తి చేసి ప్రతి ఇంటికి త్రాగు నీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవరకొండ కిరణ్, ఎంపీడీవో రామారావు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ కృష్ణవేణి, కార్యదర్శి అనంత్ కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ హరీష్, తదితరులు పాల్గొన్నారు.