28న రైతుల ఎకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు!
అర్హులైన రైతులకు పెట్టుబడి ఖర్చు కింద కేంద్రం ఏటా రూ.6 వేలు అందజేస్తోంది.
మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున ఇస్తుండగా.. ఈ దఫా డబ్బులు ఈనెల 28న అకౌంట్లలో జమ చేయనున్నట్లు సమాచారం.
అదేరోజు ప్రధాని మోదీ రాజస్థాన్లో పర్యటించనుండగా.. ఈ సందర్భంగా పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లలో జమ చేస్తారని తెలుస్తోంది.
బ్యాంకు అకౌంట్కు ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకే ఈ డబ్బులు అందనున్నాయి.
లేదంటే డబ్బులు పొందలేరు.