Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రైతుభీమా పథకం దరఖాస్తునకు ఈ నెల 18 వరకే గడువు

బోయినిపల్లి, జూలై 15 నిజం చెపుతాం;

రైతుభీమా పథకం దరఖాస్తునకు ఈ నెల 18 వరకే గడువు ఉందని పట్టా పాస్ బుక్స్ వచ్చిన రైతులు, ఇప్పటి వరకు రైతు భీమాకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు.

రైతు భీమా కు  18 నుండి 59 సంవత్సరాలు (14-08-1964 నుండి 14-08-2005 మధ్య పుట్టిన వారు) వయస్సు వారు మాత్రమే అర్హులని తెలిపారు.

అలాగే ఇది వరకు రైతు భీమా చేయించుకున్న రైతులు ఆధార్ కార్డులు ఏమైనా మార్పులు, చేర్పులు ఉన్నా లేదా మీ నామిని పేరు మార్చాలనుకున్నా మీ క్లస్టర్ పరిధి లోని ఏ.ఈ.ఓలను సంప్రదించగలరని తెలిపారు