సచివాలయంలో దొంగలు
విశాఖపట్నం నిజం న్యూస్
విశాఖనగరం లో జీవీఎంసీ 86 వార్డు పకీర్ తఖ్య సచివాలయంలో దొంగలు పడ్డారు. సచివాలయం తాళాలు పగులగొట్టి లోపల సామాన్లు చిందరవందరగా పడేసి, మద్యం సీసాలు పగులగొట్టి కార్యాలయాన్ని అస్తవ్యస్తంగా చేశారని సచివాలయ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఈ సచివాలయంలో జరిగాయని,రికార్డులు చింపి చిందరవందరగా పారేయ్యడంతో ఇబ్బందులెదురుకుంటున్నామని, ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దువ్వాడ పోలీస్ స్టేషన్ లో సచివాలయ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.