Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చంద్రయాన్‌-3 విజయంలో వీళ్ళే కీలకం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ఉపగ్రహ రూపకల్పనలో తమిళనాడుకు చెందిన వారు వీరముత్తువేల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కల్పన కాళహస్తి అసోసియేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహస్తున్నారు.

తమిళనాడులోని విల్లుపురం ప్రాంతానికి చెందిన *పి.వీరముత్తువేల్‌* చెన్నైలో బీటెక్‌, ఎంటెక్‌ చేశారు.  2004లో ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరి, బహుళ విభాగాల వాతావరణంలో సవాలుతో కూడిన అసైన్‌మెంటుల స్ట్రింగ్‌లో పనిచేశారు. రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలు, మంగళయాన్‌ మిషన్‌లో భాగస్వామ్యం అయ్యారు.

చంద్రయాన్‌-2 మిషన్‌లో అసోసియేట్‌ డైరెక్టర్‌గా కీలకపాత్ర పోషించడంతో 2019లో చంద్రయాన్‌-3 ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించారు.

కొత్త రోవర్‌, ల్యాండర్‌ నిర్మాణం ఈయన పర్యవేక్షణలోనే జరిగింది. చంద్రయాన్‌-2 మిషన్‌లో నాసాతో సంప్రదింపుల సమయంలో నాసా అందించిన లేజర్‌ రెట్రోరెఫ్లెక్టర్‌ అర్రే(ఎల్‌ఆర్‌ఏ)కి సంబంధించిన సహకారం తీసుకుని అమలు చేసే బృందంలో ఈయన కీలక పాత్ర పోషించారు.

అస్సాంకి చెందిన ఛాయన్‌ దత్తా తేజ్‌పుర్‌ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

సాంకేతికతలో ఛాయన్‌ నిష్ణాతులు కావడంతో వీటి పూర్తి నిర్వహణ బాధ్యత ఆయనే వహిస్తున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన కల్పన కాళహస్తి చెన్నైలో బీటెక్‌ ఈసీఈ చదివారు. బీటెక్‌ పూర్తయిన వెంటనే ఇస్రోలో 2000లో శాస్త్రవేత్తగా విధుల్లో చేరారు.

మొదట శ్రీహరికోటలో ఐదేళ్లపాటు విధులు నిర్వహించారు. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి 2018లో పంపిన చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో ఈమె భాగస్వామ్యం ఉంది.

శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి 2018లో పంపిన చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో ఈమె భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం చంద్రయాన్‌-3 ప్రాజెక్టు అసోసియేటెడ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.