Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉరకలు వేస్తున్న జనసేన

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా

జూలై 14..నిజం చెపుతాం న్యూస్.. (చల్లా శ్రీనివాస్.. తూర్పుగోదావరి జిల్లా..

నిజం చెపుతాం రిపోర్టర్ )

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ నందు రాజకీయ పార్టీల వ్యూహ ప్రతి వ్యూహలు రాబోవు ఎన్నికలకు ఇప్పటినుండే ఆసక్తిని రేకేస్తున్నాయి.

ఒక పక్క అధికార వైఎస్ఆర్ శ్రేణులు మళ్ళీ మేమే అంటూ ప్రకటనలు చేస్తుంటే మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ఈసారి అధికార పీఠం మాదే అంటున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయలకు ఆయువుపట్టులాంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన మాత్రం క్రమేణా పట్టు సాధిస్తూ వేగంగా బలం పుంజుకుంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ కు యువతే కాకుండ మహిళలు,పెద్దతరం కూడా మద్దతు పలకడంతో జనసేన బలం పుంజుకోవడం షురూ అయిందనేది స్పష్టంగా తెలుస్తుంది.

ఇటీవలే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్ర తొలి విడత దిగ్విజయంగా పూర్తి చేసిన జనసేనాని ఇప్పుడు రెండవ విడత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టడంతో జనసేన శ్రేణులలో ఫుల్ జోష్ కనిపిస్తుంది.

అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా రాజకీయ విమర్శలు సంధించడం,ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మాట్లాడటం రాజకీయ కురుక్షేత్రంలో పెనుప్రకంపనాలు సృష్టిస్తున్నాయి.

ఈ పరంపరలో కాపు ఉద్యమనేతగా పిలిచే ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కు లేఖ రాయడం,ఆ లేఖలో వేరే సామాజిక వర్గానికి చెందిన అధికార పార్టీ నేతలు కాపు ఉద్యమానికి సహాయం చేసారని చెప్పడం ఉభయ గోదావరి జిల్లాలలోని కాపు సామాజికవర్గానికి అస్సలు నచ్చలేదని బహిరంగంగా చాలా మంది కాపు సామాజికవర్గ నేతలు ముద్రగడ తీరును తీవ్రంగా ఆక్షేపించడంతో ముద్రగడ సైలెంట్ అయిపోయారు.

ఈ సంఘటన పవన్ ఇమేజ్ ను మరింత పెంచింది.అనంతరం పవన్ తన విమర్శలకు మరింత పదును పెట్టడంతో అధికార పార్టీ నేతలకు జవాబు ఇవ్వడం కత్తి మీద సాములా మారింది.

అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి పలువురు అధికార పార్టీ నేతలు పదే పదే మాట్లాడటం ప్రజలకు ఏ మాత్రం రుచించడం లేదనేది బహిరంగ రహస్యం.

అలాగే ఇటీవల పవన్ కళ్యాణ్ కొంతమంది వాలంటీర్స్ పై చేసిన వ్యాఖ్యలు కూడా సమాంజసమే అని మెజారిటీ శాతం ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే చాలా గ్రామాలలో కొంతమంది వాలంటీర్స్ తమ వ్యక్తిగత పనులు మాత్రమే చూసుకుంటూ కనీసం సచివాలయం మెట్టు కూడా ఎక్కడం లేదని అని పలువురు సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సమావేశాలకు వచ్చే ప్రజానీకం స్వచ్ఛందంగా రావడం,పవన్ కి కొండంత ప్రేమతో నీరాజనం పలకడం కొత్త రాజకీయ సమీకరణలకు తెర తీస్తుంది అనడంలో సందేహం లేదు.

పార్టీ ఆవిర్భావం నుండి జనసేన జెండా మోస్తున్న యువతలో చాలా మందికి 2014, 2019 ఎన్నికలలో ఓటుహక్కు లేదు. కాని ఇప్పుడు వారు ఓటర్లు గా మారి వారి కుటుంబంలో, బంధువులలో మొత్తం ఓట్లు ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఆకస్మికంగా మరణించిన పార్టీ శ్రేణులకు, కౌలురైతులకు తన సొంత ధనం హెచ్చించి పవన్ కళ్యాణ్ సహాయం చేయడం పార్టీ వర్గాలకే కాకుండా రైతులకు అలాగే మహిళలకు, నిరుద్యోగ యువతకు, బడుగు బలహీన వర్గాలకు కూడా జనసేన సిద్దాంతాల పట్ల మక్కువ కలిగేలా చేసింది.

పొత్తులపై సరైన సమయంలో స్పందించి నిర్ణయం తీసుకుంటానని జనసేనాని చెప్పిన మాటలు కూడా రాజకీయ వ్యూహంలో పవన్ పరిణతిని తెలియజేస్తున్నాయి.

ఈ పరంపర ఇలాగే కొనసాగితే….

రాబోయే ఎన్నికలలో జనసేన కచ్చితంగా ప్రజాక్షేత్రంలో తన ఉనికి చాటుకుని బలమైన పవనమై నిలబడటం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

గోదావరి జిల్లాలలో పట్టు బిగింసిన జనసేన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తమ ఉనికిని బలంగా చాటుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు స్పష్టమవుతుంది.