41 సంవత్సరాల రికార్డును తుడిచి వేసిన ముంబాయి ఓపెనర్లు
వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కొత్త కుర్రాడు యశస్వి జైశ్వాల్ లు సెంచరీ సాధించారు. అయితే వీరిద్దరూ ముంబాయికి చెందిన ఓపెనర్లు ఆటగాళ్ళు కావడం మరో విశేషం. ముంబాయికి చెందిన ఓపెనర్లు చెరో సెంచరీలు బాది 41 సంవత్సరాల క్రితం నెలకొల్పిన రికార్డును తుడిచి వేసారు.
1982 ఇంగ్లాడ్ పర్యటనలో ముంబాయికి చెందిన ఓపెనర్ల జంట సునీల్ గవాస్కర్, సురు నాయక్ లు ఈ ఘనతను సాధించారు.
వీరు మరో రికార్డును కూడా సాధించారు. 2001లో భారత్ తరుపున అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్ల రికార్డును వీరు తుడిచి వేసారు.
2001 లో వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ బంగర్ లు నెలకొల్పిన 201 ఓపెనర్ల భాగస్వామ్యం వీరు చేసిన 229 పరుగులతో తుడిచి పెట్టుకు పోయింది.
ఇది కూడా చదవండి…అరంగేట్ర మ్యాచ్ లో సెంచరీ చేసిన మూడో బ్యాటర్ యశస్వి జైస్వాల్