Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఏసీబీకి  దొరికిన శానిటరీ ఇన్స్పెక్టర్

హైదరాబాద్ : లంచం తీసుకుంటూ శానిటరీ ఇన్స్పెక్టర్ ఏసీబీకి  దొరికారు.

కార్పొరేషన్లోని వెహికల్స్ రిపేర్కు రూ. 7, లక్షల 39 వేలు, వెహికల్ పంక్చర్లకు రూ. 65 వేలు మొత్తంగా రూ. 8 లక్షల 4 వేలు పెండింగ్ బిల్లు రిలీజ్ చేయాల్సి ఉంది.

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటరీ కార్మికులకు అందించే సబ్బులు, నూనెలు, గ్లాసెస్, చెప్పులను సప్లయ్ చేసిన కాంట్రాక్టర్ ఎన్.శ్రీరాములుకు రూ.10 లక్షల చెక్కు రిలీజ్ అయింది.

ఇందుకు రూ. 10 లక్షల బిల్లుకు 5 శాతం చొప్పున 50 వేలు లంచంగా ఇవ్వాలని శానిటరీ ఇన్స్పెక్టర్ కె. జానకి డిమాండ్ చేసింది.