700 వికెట్ల క్లబ్ లో అశ్విన్
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 55వ ఓవర్ లో జోసెఫ్ వికెట్ తో 700 వికెట్ ను సాధించాడు.
ఇండియాలో అనిల్ కుంబ్లే, హర్భజన్ తర్వాత అశ్విన్ ఈ మైలు రాయిని సాధించాడు. ప్రపంచంలో ఈ మైలు రాయిని సాధించిన వారిలో 17వ వాడు.
36 సంవత్సరాల అశ్విన్ 151 వన్డే వికెట్లను, 72 టీ20 వికెట్లను, 477 టెస్ట్ వికెట్లను పడగొట్టి 700 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు.
ఇదే మ్యాచ్ లో 5 వికెట్లను సాధించాడు. అశ్విన్ టెస్ట్ మ్యాచ్ లో 33 సార్లు 5 వికెట్ల ఫీట్ ను సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ తరుపున అత్యధిక వికెట్లను సాధించిన వారిలో అనిల్ కుంబ్లే – 953 వికెట్లు, హర్భజన్ సింగ్ – 707 వికెట్లు, అశ్విన్ – 702 వికెట్లు, కపిల్ దేవ్ – 687 వికెట్లు, జహీర్ ఖాన్ -597 వికెట్లను సాధించారు.