Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎమ్మెల్యే రెడ్యాకు నిరసన సెగ..!

…డబుల్ బెడ్రూం ఇండ్లపై నిలదీసిన ప్రజలు.

…బెదిరింపులకు భయపడేది లేదు.

…ప్రజలు నన్నే ఆదరిస్తారు..,మళ్ళీ నేనే గెలుస్తా: ఎమ్మెల్యే రెడ్యానాయక్.

కురవి,నిజంచెపుతాం,జూలై 12:

డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ అడుగడుగునా నిరసన సెగ ఎదురౌతుంది.అభివృద్ధి పనులు, డబుల్ బెడ్రూం గృహాలపై ప్రజలు నిలదీస్తున్నారు.సంక్షేమ పథకాలు, సమస్యలపై గ్రామాల్లోకి వచ్చిన ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది.

బుధవారం కురవి మండలంలోని బంగ్య తండా,నేరడ గ్రామమానికి పలు అభివృద్ధి పనుల ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను స్థానికులు అడ్డుకుని నిరసన తెలిపారు.బంగ్యతండాలో అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదని గ్రామస్తులు నిలదీశారు.

డబుల్ బెడ్రూం ఇండ్లు పేదలకు ఇవ్వకుండా ఉన్నవారికే ఇస్తున్నారని బంగ్యా తండాలో ఎమ్మెల్యే అడ్డుకున్నారు. రెడ్యానాయక్ డాం డాం అంటూ మా గ్రామానికి రావద్దంటూ నినాదాలు చేశారు.

తండాలో రెండు గంటలపాటు కదలనివ్వకుండా చేశారు.భారీ బందోబస్తు నడుమ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తండా నుంచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు.అయితే ఇద్దరు మహిళలు కాన్వాయ్ కు అడ్డు తగిలి తన నిరసన వ్యక్తం చేశారు.

తమ గ్రామానికి రావొద్దని అడ్డగించారు.వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. పోలీసులకు,గ్రామస్తులకు తోపులాట జరిగింది.ఈ సమయంలో కొందరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు.

అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు.తండా నుంచి నేరడ గ్రామానికి ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామానికి రానివ్వకుండా ఊరు బయటనే అడ్డుకున్నారు.

దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని,గూడులేని పేదలకు డబుల్ బెడ్రూం గృహాలు ఇవ్వాలని,గ్రామానికి ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.

పోలీసులు అడ్డుకున్నారు.గంటపాటు పోలీసులకు,గ్రామస్తులకు తోపులాట జరిగింది.బారీ బందోబస్తు నడుమ ఎమ్మెల్యే రెడ్యాను గ్రామంలోకి చేరుకున్నారు. గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు.తదుపరి రేకులతాండ,తదితర తండాలకు పర్యటన కొనసాగించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రెడ్యానాయక్ మాట్లాడుతూ…ఉనికిలేనివారి బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజలు నన్ను ఆదరిస్తారని,మళ్ళీ నన్నే గెలిపిస్తారని రెడ్యా అన్నారు. రెండు నెలల్లో గృహాలు మంజూరు చేస్తామని,సిసిరోడ్డు పలు అభివృద్ధి పనులు మంజూరు చేస్తామని రెడ్యా హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి గుగులోత్ పద్మావతి రవినాయక్,జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు తోట లాలయ్య,సొసైటీ చైర్మన్ దొడ్డ గోవర్ధన్ రెడ్డి, సర్పంచులు గుండోజు శ్రీనివాస్ చారి,కౌశల్య,మంగిలాల్,ప్రభుత్వం వివిధ శాఖల అధికారులు, యువనాయకులు గుగులోత్ రవినాయక్,మాలోత్ సూర్య, వెంకటరమణ,తదితరులు పాల్గొన్నారు