ఆర్ డి ఫోర్ కాలువ మరమ్మత్తులు..
నిజం కథనానికి స్పందించిన అధికారులు
చర్ల జూలై 11 ( నిజం చెపుతాం) మండలంలోని తాలి పేరు మధ్యతరహా ప్రాజెక్ట్ పరిధిలో గల ఆర్డిఫోర్ కెనాల్ మరమ్మత్తు పనులు నిజం దినపత్రికలో అడవిని తలపిస్తున్న ఆర్డిఫోర్ కాలువ చివరి భూములకు నీరు అందేనా… పట్టించుకోని ప్రాజెక్టు అధికారులు కథనాలకు స్పందించిన ప్రాజెక్టు అధికారులు ఎట్టకేలకు మరమ్మత్తులు చేపట్టారు
కలివేరు నుండి తేగడ మేడివాయి కొత్తగట్ల లింగాల ముమ్మడివరం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవు పూడికతీత పనులు ప్రాజెక్టు అధికారి డి ఈ తిరుపతి నేతృత్వంలో జేఈ ఉపేందర్ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు
ఈ కెనాల్ కింద సుమారు నాలుగువేల ఎకరాలు రైతులు వరి సాగు సేద్యం చేస్తున్నారు
గత రెండు సంవత్సరాలుగా కెనాల్ ద్వారా చివరి భూములకు నీరు అందక చేతికొచ్చిన పంట చివరి దశలో ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు
దీంతో నిజములో వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు పూడికతీత పనులు ప్రారంభించారు