Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రైతుభీమాకు రైతులు దరఖాస్తు చేసుకోవాలి..

మండల వ్యవసాయ అధికారి: రాధ

ముదిగొండ జూలై 11(నిజం చెపుతాం):-

రైతుభీమాకి రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాధ తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల‌ కేంద్రమైన ముదిగొండతో పాటు మండలంలోని అయా అయా గ్రామాలకు చెందిన రైతులు 18-06-2023 వరకు కొత్త పట్టా పాస్ బుక్క్ లు పొందిన రైతులు మాత్రమే రైతుభీమాకి దరఖాస్తు చేసుకొవాలన్నారు.

దరఖాస్తు చేసుకొనే రైతులు 18నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారే అర్హులన్నారు. రైతుభీమా ధరఖాస్తు విషయం తెలియని రైతులకు గ్రామస్తులు కూడా భాద్యత తీసుకొని‌ ఈ సమాచారాన్ని రైతులకు అందించాని అమె కోరారు.

దరఖాస్తు చేసుకునేందుకు పట్టాదారు పాసు బుక్, రైతు ఆధార్ కార్డ్, నామిని ఆధార్ కార్డ్, రైతు భీమా ధరఖాస్తు ఫారం జిరాక్స్ లను అ గ్రామ క్లస్టర్ రైతువేదికలో ఇవ్వలన్నారు.