Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రైతు ఐడియా అదిరిందయ్యా..!

వినూత్నంగా బైక్ తో చేనులో గుంటుకు

ముధోల్ నియోజకవర్గ ప్రతినిధి, జులై 10 (నిజం చెపుతాం)

వ్యవసాయంలో సైతం యాంత్రికీకరణ రోజు రోజుకు పెరిగిపోతుంది. రైతులకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే బసవన్నల సంఖ్య సైతం తగ్గిపోయింది.

దీంతో సన్నకారు చిన్నకారు రైతులు వ్యవసాయ పనులు చేయడానికి అందుబాటులో ఉన్న యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే యంత్రాల ధరలు సైతం పెరిగిపోవడంతో గిట్టుబాటు కావడం లేదు.

ముధోల్ మండల కేంద్రానికి చెందిన సొంకాంబ్లీ బాబు అనే రైతు తన పంట చేనులో వేసిన పత్తి పంటలో గుంటుకు కొట్టడానికి వినూత్నంగా ఆలోచించాడు.

తనకున్న లూనాతో పంట చేనులో వ్యవసాయ పనులు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. రైతు ఐడియా అదిరిందయ్యా అని ప్రతి ఒక్కరు ప్రశంసించారు.

విభిన్నమైన ఆలోచనలతో వినూత్న పనులు చేపట్టవచ్చని రైతు నిరూపించాడు. గుంటుకు కట్టడానికి ఎడ్లు లేకున్నా తన లూనాను ఉపయోగించి వ్యవసాయ పనులు పూర్తి చేశాడు.

రైతు మాట్లాడుతూ తనకు ఉన్న ఎకరం నరా భూమిలో వేసిన పత్తిలో గుంటుకు కొట్టడానికి ఎడ్లు లేకపోవడంతో లూనా తోనే పని కానిచ్చానని తెలిపారు.

ట్రాక్టర్ తో పనులు చేపడితే ఆర్థికంగా భారం అవుతుందని వెల్లడించాడు. రైతు ఆలోచన అందరిని ఆలోచింపజేస్తుంది.