Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విద్యారంగ సమస్యల పరిష్కారానికై పాఠశాలలు, కళాశాలల బంద్

లెఫ్ట్ స్టూడెంట్ యూనియన్ పిలుపు- SFI -AISF-PDSU.

జూన్ 10భద్రాచలం:- నిజం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బందు నిర్వహిస్తున్నట్టు ఈ బందులో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు (యస్ ,భూపేందర్ SFI)( గణేష్-AISF)(శివప్రశాంత్-PDSU) మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ ఫీజులు దందా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ వాటి నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారన్నారు.

మంత్రులు ఉప సంఘం తిరుపతి రావు కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయకపోవడం చూస్తే ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా ఉందన్నారు విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న యూనిఫార్మ్స్ , పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు చదువులు చెప్పే టీచర్లు కూడా లేరని పారిశుద్ధ్య కార్మికులు లేరని అనేక సమస్యలతో విద్యా సంవత్సరం ప్రారంభమైన నిర్దిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు

త్రాగునీరు, మధ్యాహ్న భోజనం, బిల్లులు పెండింగ్, మూత్రశాలల సరైన మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యా రంగం గొల్లుమంటుందన్నారు మన ఊరు-మన బస్తి-మనబడి నిధులతో గుత్తేదారులు మంత్రంగా మాత్రమే పనులు చేశారని విమర్శించారు ఎక్కడ సరిగ్గా పాఠశాలలకు ఉపయోగపడదే పడలేదన్నారు

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ అందని ద్రాక్షగా మారిందని తెలిపారు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కూడా అందివ్వలేదని వారు తెలియజేశారు , టీచర్స్ ,లెక్చరర్స్ లేరని ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని రాష్ట్రంలో నాలుగేళ్ల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రూ..5,1777 కోట్ల పెండింగ్ లో ఉన్నాయని వాటిని కనీసం విడుదల చేయడం లేదని గురుకులాలు, కేజీబీవీలు ఇంటర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసినవారికి భవనాలు లేక సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయని వివరించారు

వాటికి నిధులు లేవని లెక్చరర్స్ ,టీచర్స్ లేరని నాణ్యమైన భోజనం లేక పుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరుగుతున్నాయని వాటిని పట్టించుకోవడంలో అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు

రాష్ట్రంలో భారీ సంఖ్యలో టీచర్స్, లెక్చరర్స్, ఎంఈఓ, వార్డెన్ చాలా పోస్టు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయడం లేదని రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక్క డీఎస్సీ కూడా ఇప్పటివరకు వేయడం లేదని అందుకే ఈ సమస్యల పరిష్కారం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను కదిలించాలని బంద్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారం చేయాలని వారు తెలియజేశారు

అన్ని మండలాల్లో బంద్ విజయవంతం చేయాలని విద్యార్థి లోకానికి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి,….
ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి నాయకులు భూపేందర్, శివప్రశాంత్, గణేష్, విద్యార్థిని,విద్యార్థులు, నవీన్,పాల్గొన్నారు.