Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేటి నుంచి మోడల్ స్కూల్లో స్పాట్ అడ్మిషన్లు

కమలాపూర్ జూలై 11 (నిజం చెపుతాం) మండలంలోని గూడూరు గ్రామంలో గల తెలంగాణ మోడల్ స్కూల్ లో 6,7,8,9 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ జి అనిత పత్రిక ప్రకటన విడుదల చేశారు.

నేటి నుండి 14 వ తారీకు వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని మండల పరిధిలోని ఆసక్తిగల విద్యార్థులు ఉదయం 10 గంటలకు ఆధార్ కార్డు మరియు ఇతర ధ్రువపత్రాలు తీసుకొని హాజరు కావాలన్నారు.

మా పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామన్నారు.