Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసిన బోట్ కంపెనీ

boAt కంపెనీ భారత్‌లో కొత్తగా స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘boAt Wave Fury’. దీని ధర రూ.1,399. కానీ లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.1,299 కే లభిస్తుంది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

వేవ్ ఫ్యూరీ స్మార్ట్ వాచ్ 1.83-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. మెటల్ కోటింగ్‌తో దీన్ని డిజైన్ చేశారు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో వాచ్ నుంచి నేరుగా కాల్స్ చేయవచ్చు, అలాగే ఆన్సర్ చేయవచ్చు. ఈ వాచ్‌లో 10 కాంటాక్ట్ నెంబర్లను సేవ్ చేసుకోవచ్చు.

హెల్త్ కోసం 24×7 హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, రన్నింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్‌, 50 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది.

అలాగే, వాతావరణ అప్‌డేట్‌లు, రిమైండర్‌లు, స్మార్ట్ నోటిఫికేషన్‌లు, ఫైండ్ మై ఫోన్ ఫీచర్, మ్యూజిక్ కంట్రోల్, అలారం, స్టాప్‌వాచ్ మొదలగు ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ Google అసిస్టెంట్ లేదా సిరి వంటి వాయిస్ అసిస్టెంట్‌లకు సపోర్ట్ ఇస్తుంది.

ఇది సాధారణ మోడ్‌లో 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. వాచ్ దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP67 రేటింగ్ చేయబడింది.