Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ పంట సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చు…

డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యింది. డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ పోషక విలువల కారణంగా చాలామంది ఈ పండును తినడానికి ఇష్టపడతారు. చూడడానికి గులాబీ రంగులో ఆకర్షిస్తుంది. ఈ పండు లోపల దీని గింజలు తెల్ల రంగులో ఉంటాయి. దీని రుచి కొంచెం అటు ఇటుగా తాటి ముంజల్లా ఉంటాయి.

డ్రాగన్ ఫ్రూట్స్ తో పలు ఆహారాలు తయారు చేస్తారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ను పిటాయా స్ట్రాబెర్రీ ,పియర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండులో శరీరానికి కావాల్సిన శక్తినిచ్చే ఫైబర్స్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్ ,ఫాస్పరస్, విటమిన్ సి, వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు.

డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఈ సూచనలు పాటించాలి…

డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పూర్తిగా ఆర్గానిక్ విధానంలో నాటేందుకు పోల్స్ మధ్యన అడుగు మందం బోదే పోసి వాటి మధ్యలో వర్మి కంపోస్ట్, పశువుల ఎరువు, గొర్రెలు కోళ్ల పెంట ఎరువు వేయాలి, వీటితోపాటు ట్రైకో డెర్మా, సుడో మోవాస్, ఫాస్పరస్ సల్ఫర్ బ్యాక్టీరియా కలిపి బోదెలలో కప్పి ఆ తర్వాత వాటిపై సాప్ పిచికారి చేయాలి. కాపు వచ్చేందుకు 8 నెలల సమయం పడుతుంది. చీమల నివారణకు పాల్ డార్ పౌడర్, దోమల నివారణకు స్టేట్ బ్యాగ్స్ ను ఉపయోగించాలి.

అధిక దిగుబడి ఇచ్చే డ్రాగన్ ఫ్రూట్ రకాలు…

డ్రాగన్ ఫ్రూట్లో చాలా రకాలు ఏంటో తెలుసుకుందాం

తైవాన్ పింక్, సియాన్ రెడ్, మొరాకల్ రెడ్, అమెరికన్ బ్యూటీ, ఆసీస్ వైట్, రాయల్ రెడ్, ఇజ్రాయిల్ యెల్లో ఇవి డ్రాగన్ ఫ్రూట్ రకాలు…

దిగుబడి మార్కెటింగ్….

సర్వరోగ నివారిణిగా ప్రసిద్ధి చెందిన డ్రాగన్ ఫ్రూట్ సాగులో మంచి మెళుకువలు పాటిస్తే ఎకరాకు 10 టన్నుల దిగుబడి వస్తుంది. వీటిని స్థానిక వ్యాపారలతో పాటు హైదరాబాద్, ముంబై ,పశ్చిమ బెంగాల్ మార్కెట్ చేస్తే అధిక లాభాలు పొందవచ్చు.

డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేస్తే ఎకరాకు రూ 10 లక్షలు ఆదాయం ఇస్తూ సిరుల పంటగా పిలుస్తారు…