Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జగన్ మళ్లీ వస్తే ఆంద్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుంది

తెలుకుల కులం అభివృద్ధి చెందాలంటే దేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి

:: అఖిల గాండ్ల తెలికుల కార్పొరేషన్ రాష్ట్ర కన్వీనర్ మాజీ ఛైర్పర్సన్ విశాలాక్షి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం బలిఘట్టం లో పేలూరి శంఖర్ రావు మీనాక్షి దంపతుల ఆదర్వంలో అఖిల గాండ్ల తెలికుల సంఘం సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అఖిల గాండ్ల తెలికుల కార్పొరేషన్ కన్వీనర్, మాజీ ఛైర్పర్సన్ శ్రీమతి గాండ్ల. విశాలాక్షి మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేశారని అన్నారు.

పెన్షన్ పెంచింది తెలుగు దేశం పార్టీనే అన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అన్నివిధాలా మోసం చేస్తుందనన్నారు. అన్ని రకాలగా ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందన్నారు. మరో సారి జగన్ అధికారంలోకి వస్తే ఆంద్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందన్నారు. పరిశ్రమలు సహితం దూరం అవుతున్నాయన్నారు.

 

రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. బీసీ లకు ప్రత్యేక చట్టం తీసుకు రావాలని నారా చంద్రబాబు నాయుడు చూస్తున్నారని అన్నారు. తెలికుల కులస్తుల కోసం గానుల ఏర్పాటు కోసం 5 లక్షల రూపాయలు సహయం అందిస్తామని, విదేశీ చదువులు చదివే విద్యార్థులకు స్కాలర్ షిప్ లందిస్తామన్నారు. తెలుకుల కులస్తులు తమ కులం గురించి గొప్పగా చెప్పుకునే రోజులు రావాలన్నారు.

 

 

తెలుగు పార్టీ ని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు ను సిఎం చేస్తే తెలుకుల కులస్తులు అన్ని విధాల అభివృద్ధి సాదిస్తారని గాండ్ల. విశాలాక్షి అన్నారు.నర్సీపట్నం తెలుగు దేశం పార్టీ యువ నాయకులు చింతకాయల. రాజేష్ మాట్లాడుతూ బీసీ లు అన్నివిధాలా అభివృద్ధి సాదించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు.

దేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుకుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చెస్తామన్నారు. .గొలుగొండ మాజీ సర్పంచ్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం అభివృద్ధికి అందరూ కృషి చేయాలని అన్నారు.

అనంతరం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పేరూరి. బుల్లిదొర మాట్లాడుతూ తెలికుల సంఘం అభివృద్ధికి విశేష కృషి చెస్తామన్నారు.

16 లక్షల మంది తెలుకుల కులస్తులు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలికుల సంఘం నాయకులు, వేలాది మంది తెలుకుల కులస్తులు పాల్గొన్నారు.