Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పాఠశాలలో సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే కిశోర్ ఆర్థిక సాయం

*పాఠశాలలో సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే కిశోర్ ఆర్థిక సాయం

ఎమ్మెల్యే సహకారం పట్ల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం

తుంగతుర్తి జులై 11 నిజం చెబుతాం న్యూస్

తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నెలకొన్న సదుపాయాల కల్పనకు తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ రూ.70 వేల ఆర్థిక సాయం అందించారు. మంగళవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ ఉమారాణికి అందజేశారు. ఎమ్మెల్యే కిశోర్ కు పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నల్లు రామచంద్రారెడ్డి, గోపగాని రమేష్ గౌడ్, ‌కటకం వెంకటేశ్వర్లు, చెరుకు పరమేష్, తడకమల్ల రవికుమార్, తునికి సాయిలు, గోపగాని వెంకన్న తో పాటు పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు…