Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మాదిగ బిడ్డగా తుంగతుర్తి అసెంబ్లీ నుంచి పోటీ బరిలో

ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు మాజీ గిడ్డంగుల చైర్మన్ మందుల సామేల్

తుంగతుర్తి జులై 10 నిజం చెబుతాం న్యూస్

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 14వ తారీఖున ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నిర్వహించే తెలంగాణ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్, తెలంగాణ మలిదశ ఉద్యమకారులు మందుల సామేల్ ప్రజలకు తెలుపునిచ్చారు.

సోమవారం తుంగర్తి మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేలానికి సంబంధించి తెలంగాణ సహచర ఉద్యమకారులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ యొక్క సమ్మేళనానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, క్యూన్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న, ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ తదితరు తెలంగాణ ఉద్యమకారులు హాజరవుతున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాటి తెలంగాణ ఉద్యమ ఆవిర్భావం నుండి నేటి వరకు సీఎం కేసీఆర్ తో కలిసి అడుగులో అడుగై పయనించి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశానన్నారు.

గత 22 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉన్నానని, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో నా శక్తి కొద్దీ పలు జిల్లాలలో ఇన్చార్జిగా పనిచేశానని తెలిపారు. రెండుసార్లు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని మాట తప్పిన, కెసిఆర్ పై నమ్మకంతో ఆత్మగౌరవంతో పనిచేశానని తెలియజేశారు.

తనతో పనిచేసిన ఉద్యమకారులందరికీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గౌరవించిన కెసిఆర్,ఒక మాదిగ బిడ్డగ నాకు ఎలాంటి టికెట్ ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలలో తిరుమలగిరిలో జరిగిన కేటీఆర్ సభకు నన్ను పిలవకపోవడంతో అవమానంగా భావించి ఒక ఉద్యమ కారునిగా నాకు గౌరవం ఇవ్వకపోవడం బాధ కలిగి పార్టీకి రాజీనామా చేశానని అన్నారు.

ఏ విధంగానైతే మలిదశ ఉద్యమంలో 2001 నుండి నేటి వరకు ఉద్యమాన్ని నెత్తిన ఎత్తుకొని ఉద్యమ బాటలో కెసిఆర్ తో ప్రయాణం చేసి తుంగతుర్తి లో పార్టీనీ నిలబెట్టుకున్నాను అన్నారు. వచ్చే ఎన్నికల్లో సబ్బండ వర్గాలు ఏకమై ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఒక మాదిగ బిడ్డగా తనను గెలిపించాలని కోరారు. ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి గ్రామం నుండి ఇంటికొకరు వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉద్యమ సహచరులు ఓరుగంటి సత్యనారాయణ, స్వర్గం మల్లయ్య, ఎర్ర సత్యం, బిక్షం, శ్రీనివాస్, భూపతి వెంకన్న, శ్రీరాములు, నాగరాజు, శ్రీధర్, హేమా నాయక్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు…