Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దొంగలను పట్టించిన సీసీ కెమెరా

భైంసా కిరాణ షాపులో 5 గురు యువకుల చోరి*

*రూ. 40వేలు అపహరణ*

*సీసీ ఫుటేజీతో నిందితులను పట్టుకున్న పోలీసులు*

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో జూలై 10

( నిజం న్యూస్ )

భైంసా రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసా పట్టణంలోని పురాణాబజార్ కిరాణాషాపులో చోరీకి పాల్పడ్డ 5గురు నిందితులను సీసీ కెమెరాలు పట్టించాయి. స్థానిక పురాణాబజార్ కాలనీలోని అబ్ధుల్ ఇర్ఫాన్ అనే వ్యక్తి కిరాణాషాపులో శనివారం రాత్రి 5గురు యువకులు చోరికి పాల్పడ్డారు.

అర్ధరాత్రి వేళలో షాపు తలుపులను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన 5గురు యువకులు వస్తువులను చిందర వందర చేసి, కౌంటర్ లోని రూ. 40వేలను అపహరించుకుపోయారు.

ఆదివారం సంబంధిత విషయమై షాపు యజమాని పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పట్టణ సీఐ ఎల్. శ్రీను నేతృత్వంలోని పోలీసుల బృంధం చోరి కేసును చేదించేందుకు పకడ్బందీ చర్యలు- చేపట్టారు. ఇందులో భాగంగా పురాణా బజార్ ప్రాంతములోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా చోరీకి వెళ్తున్న నిందితుల గుర్తించారు.

పురాణా బజార్ ప్రాంతానికి చెందిన షేక్ అద్నాన్, సయ్యద్ సోహెబ్, షేక్ మెహ్రాజ్, సయ్యద్ సల్మాన్, షేక్ సల్మాన్లుగా వారిని గుర్తించారు. ఆదివారం రాత్రి వేళలో నిందితులను పట్టుకొని పోలీస్టేషన్ కు తరలించి తమదైన శైలీలో విచారించగా నిందితులు దొంగతనానికి పాల్పడ్డ విషయాన్ని ఒప్పుకున్నారు.

వారి వద్ద నుంచి రూ.38,800లు రికవరీ చేసి, నిందితులను రిమాండ్ కు తరలించినట్లు టౌన్ సీఐ ఎల్. శ్రీను తెలిపారు.