Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రేటు పెరిగింది..వ్యాపారం తగ్గింది

కమలాపూర్ జూలై 9 (నిజం చెపుతాం)

అమ్మబోతే అడవి కొనబోతే కొరివి లాగా ఉంది కూరగాయల ధరలు వర్షాకాలం ఆరంభంలోనే ఆకాశాన్ని అంటుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.

ముఖ్యంగా టమాటో 150 రూపాయల నుండి 200 వరకు ధర పలుకుతుండగా అదే రీతిలో వంకాయ బెండకాయ పచ్చిమిర్చి బీరకాయ చిక్కుడుకాయ మొదలైన కూరగాయలు కూడా అధిక ధరకు లభించడంతో అటు వ్యాపారులకు వినియోగదారులకు కూడా తలకు మించిన భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కమలాపూర్ మండల కేంద్రంలో స్థానిక కూరగాయల మార్కెట్ లో రోజుకు 50 నుండి 60 మంది కూరగాయల వ్యాపారం చేస్తుండగా పెరిగిన ధరల కారణంగా 20 నుండి 25 మంది వరకే రోజు వ్యాపారాన్ని చేస్తున్నారన్నారు. ఇందుకుకూరగాయల ధరలు పెరగడమే కారణమని చెబుతున్నారు.

రూపాయలు 10 నుండి 15 వేలు పెట్టుబడి పెడితే తప్ప వ్యాపారానికి కూరగాయలు రావడంలేదని వారు చెప్తున్నారు. కొత్తగా సాగుచేసిన కూరగాయలు మార్కెట్లోకి వస్తే తప్ప ధరలు అదుపులోకి వచ్చి తమ వ్యాపారం సజావుగా సాగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

కూరగాయల ధరలు తక్కువ ఉన్న కాలంలోనే తమ వ్యాపారం లాభసాటిగా సాగేదని వ్యాపారి జక్కు సతీష్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.