Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మదర్ ఇండియా బుక్ అఫ్ వరల్డ్ రికార్డు సాధించిన అర్చన

హైదరాబాద్ బ్యూరో జులై 9, (నిజం న్యూస్ )
మదర్ ఇండియా బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ సౌజన్యంతో, ప్రేమ ట్రస్ట్ పర్ఫెక్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో భారతీయ నృత్యోత్సవాలు 2023 సందర్బంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వావిద్యాలయం లో అంతర్జాతీయ, జాతీయస్థాయి విశిష్ట పురస్కారాలు వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన వారికి ప్రదానం చేయడం జరిగింది.

కురవి మండల కేంద్రానికి చెందిన ముంజాల అర్చన భరతనాట్యం, పెరిని నాట్యం, జానపద నృత్యాలలో అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూ కేవలం ఆరు సంవత్సరాల వయసులోనే 20కి పైగా అవార్డులు మరియు రికార్డులు సాధించడం జరిగింది.

తెలంగాణ లోనే కాకుండా పక్క రాష్టాలలో కూడా తన నాట్యం ద్వారా అద్భుతమైన ప్రధర్షణలు ఇచ్చి ఎన్నో అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. మదర్ ఇండియా బుక్ అఫ్ వరల్డ్ రికార్డు వారు నిర్వహించిన అడిషన్ లో అర్చన అంతర్జాతీయ అవార్డు కు ఎంపిక కావడం జరిగింది ప్రముఖుల చేతుల మీదుగా అర్చన, అంతర్జాతీయ అవార్డు ఆందుకోవడం జరిగింది.

ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మదర్ ఇండియా వరల్డ్ రికార్డు, ఇండియా చీఫ్ దాసరి మహేష్, ఏపీ చీఫ్ పి. సురేష్, ల చేతుల మీదుగా అర్చన కు మదర్ ఇండియా బుక్ అఫ్ వరల్డ్ రికార్డు లో అవకాశం కలిపిస్తూ ప్రశంస పత్రం తో సత్కారించడం జరిగింది.

అదేవిదంగా మదర్ ఇండియా బుక్ అఫ్ రికార్డు వారు అర్చన అద్భుతమైన నాట్య ప్రదర్శనకు గాను “నాట్య రత్నా” అవార్డు కూడా ఇచ్చి అర్చన ను అభినందించడం జరిగింది.

వివిధ రాష్టలా నుండి కళాకారులూ, ఉపాధ్యాయులు, కవులు, లాయర్లు, స్వంచందా సంస్థలు ఈ కార్యక్రమం లో పాల్గొని వివిధ రంగాలకు సంబందించిన అవార్డ్స్ అందుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మదర్ ఇండియా సభ్యులు టి. సుధారాణి, పి. సునీత, తదితరులు పాల్గొన్నారు