Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆరోగ్య రథం పేద ప్రజలకు వరం

౼ చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామంలో ఆరోగ్య రథానికి శ్రీకారం
౼ చేవెళ్ల ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
౼ ఆరోగ్యంపై అశ్రద్ధ వహించవద్దు
౼ ఎంపీ రంజిత్ రెడ్డి
౼ గ్రామీణ నిరుపేదలకు వరం
౼ ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, జూలై 09 (నిజం న్యూస్) :
చేవెళ్ల ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ‘చేవెళ్ల ఆరోగ్య రథం’ ను చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆలూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి, సాయి చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పై శ్రద్దగా ఉండాలన్నారు. ఆరోగ్యంపై అశ్రద్ధ వహించవద్దని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ‘చేవెళ్ల ఆరోగ్య రథం’ పేరిట ఉచితంగా అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్య పరిరక్షణ కొరకు ఆరోగ్య రథం మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. పేద ప్రజలకు సేవ చేయడం దైవసేవతో సమానమని అన్నారు.
అదేవిధంగా ఆలూర్ ను మండలం ప్రకటన చేసే విషయాన్ని కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్తనని హామీ ఇచ్చారు. కొంత సమయం తీసుకున్న కూడా ఖచ్చితంగా ఆలూర్ ను మండలం చేస్తామని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదల కోసం వైద్య శిబిరాన్ని ఆరోగ్య రథంతో నిర్వహించటం అభినందనీయమన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో విరసిల్లాలని రంజిత్ రెడ్డి గారి సంకల్పమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలూరు సర్పంచ్ కవ్వగూడం విజయలక్ష్మి నర్సిములు, జడ్పీటీసీ మాలతి కృష్ణా రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మీ రమణా రెడ్డి, ఎంపీటీసీలు నరేందర్, యాదమ్మ, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.