Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పొత్తు కాదు, వైసీపీని చిత్తు చేయడమే లక్ష్యం

*సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం
* నిస్వార్ధంగా కష్టపడితే అధికారం దానంతటదే వస్తుంది
* వైసీపీ అరాచక పాలనతో 70 శాతం ప్రజలు విసిగిపోయారు
* రాష్ట్రానికి స్థిరత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యం. కంగారు పడే పనిలేదు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం , జూలై 9,( నిజం చెపుతాం ) బ్యూరో::
వారాహి విజయ యాత్ర విజయవంతం కావడంతో జనసేనాని గోదావరి జిల్లాల ప్రజల్లో పట్టు సాధించారు. దాంతో అధికార వైసీపీకి జనసేన పార్టీ సరైన ప్రత్యామ్నాయం కానుంది అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి విశ్వాసం చిక్కింది.

అప్పుడే పొత్తులకు కంగారు పడవద్దని జనసేన శ్రేణులకు ఆయన సంకేతాలను ఇచ్చారు. కష్టపడితే విజయం దానంతట అదే వరిస్తుందన్న సందేశాన్ని జన సైనికులకు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందని.. కాబట్టి, పొత్తుల గురించి ఆలోచించేందుకు టైమ్ ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వారాహి విజయయాత్ర కమిటీలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలా, కలిసి వెళ్లాలా అనేది తర్వాత మాట్లాడే విషయమని స్పష్టం చేశారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై పూర్తి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

మనం కష్టపడి పని చేస్తే అధికారం దానంతట అదే వస్తుందని, జన సైనికులు అందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో తీవ్రంగా కష్టపడుతున్నారని అన్నారు. మనం కష్టపడి పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని, నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

తన సందేశం ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతుందని కంగారు పడవలసిన పనిలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అరాచక వైసిపి పాలనపై ఇప్పటికే 70 శాతం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన అన్నారు.

వైసిపి అరాచక పాలనను అంత మన్నించడంలో జనసేన పార్టీ క్షేత్ర స్థాయి నుంచి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలాగే రెండవ విడత వారాహి విజయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

రెండోదఫా వారాహి విజయ యాత్ర లో భాగంగా ఏలూరు సభను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ఆయన జన సైనికులను, అభిమానులను కోరారు.