Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

శంకర్ నాయక్ కు మళ్ళీ టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం

మలిదశ ఉద్యమకారుడు పుచ్చకాయల రామకృష్ణ.

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, జూలై 8, నిజం న్యూస్

మహబూబాబాద్ లోని స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శనివారం తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పుచ్చకాయల రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమ కారుడు పుచ్చకాయల రామకృష్ణ మాట్లాడుతూ”రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కారులంతా కోరుకునేది, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కి టికెట్టు ఇవ్వకూడదని అధిష్టానాన్ని తెలియజేస్తున్నాo. ఉద్యమకారులని మరిచిన ఆయనకి టికెట్ ఇస్తే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయే ప్రమాదం ఉంది.

కాబట్టి వేరే ఎవరికీ అయినా పర్లేదు భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మహబూబాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తప్ప వేరే ఎవరికీ టికెట్ ఇచ్చిన,గెలిపించుకుంటామని, రామకృష్ణ అన్నారు. మానుకోట “ఉద్యమ కారులకు తీవ్ర ద్రోహం”చేసిన శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వకూడదని కేసిఆర్ కి విజ్ఞప్తి చేశారు.

ఈకార్యక్రమంలో అహ్మద్ ఖాన్, చంద్రారెడ్డి,ఖయ్యుం,కైరంకొండ రాము,చెక్కల అశోక్ తదితరులు పాల్గొన్నారు.