Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబిబిఎస్ సీట్లలో 5 శాతం రిజర్వేషన్

పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజీ పేరును సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SIMS) గా మార్చడంతో పాటు, ఉద్యోగుల పిల్లలకు ఎంబిబిఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటుగా ఈ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని 50 పడకలను సింగరేణి ఉద్యోగులకు కేటాయించింది .

సింగరేణి ఉద్యోగుల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రామగుండం మెడికల్ కాలేజిలో మొత్తం150 ఎంబిబిఎస్ సీట్ల ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా కోటా కి వెళ్తాయి. మిగతా 127 ఎంబిబిఎస్ సీట్లలో 5% రిజర్వేషన్ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయించడం జరిగింది.

నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు.

సింగరేణి ఉద్యోగుల పిల్లలు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.