Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వ సొమ్ముకు… ఉన్నతాధికారి ….ఎసరు

మండల విద్యాధికారిది ఇష్ట ….రాజ్యమేనా?

డబ్బులు ఇస్తే… ఒకరి ఉద్యోగ బాధ్యతలు… మరొక రా.

రికార్డుల్లో సంతకాలు చేస్తూ ,జీతాలు, దోచుకుంటున్న వైనం.

సూర్యాపేట ప్రతినిధి జులై 7 నిజం చెబుతాం న్యూస్

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల బాగోగులు చూడవలసిన బాధ్యత గల మండల విద్యాధికారి బోయిన లింగయ్య ఇస్తారాజ్యంతో ఎమ్మార్సీ భవనంలో కంప్యూటర్ ఆపరేటర్ గా మహిళ విధులు నిర్వర్తిస్తుండగా… గత కొంతకాలంగా ఆమె విధులు రాకపోవడంతో… భర్త విధులు నిర్వర్తిస్తూ … కొన్ని నెలలుగా పనిచేస్తున్న… డ్యూటీలో సమయపాలన చేయకపోయినప్పటికీ.. దినసరి రికార్డుల సంతకాలు చేస్తూ.. నెల నెల జీతాలు మాత్రం ఏమీ ఎర్రగనట్లు స్థానిక ఎంఈఓ జిల్లాకి ప్రతినెల బిల్లులు పంపడంతో సదరు వ్యక్తి ప్రతినెల పూర్తిస్థాయిలో జీతం తీసుకుంటున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది..

మండలంలో విద్యాశాఖలో ప్రముఖ వ్యక్తిగా ఉంటూ… తప్పులు జరిగితే సరిదిద్ద వలసిన అధికారి….. ప్రభుత్వ సొమ్ముకు గండి పెట్టడమేందని వివిధ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు ,ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు…