తెరుచుకోని వార్డ్ సచివాలయం …ఇబ్బందులు పడ్డ ప్రజలు
నిజం న్యూస్. విశాఖపట్నం
వార్డ్ సచివాలయం బుధవారం ఉదయం నుంచి తెరవక పోవడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు.
ఓ పక్క గ్రామపంచాయతీ ల్లో సచివాలయాలు చక్కగా పనిచేస్తుండగా, నగరంలో ఉన్న వార్డ్ సచివాలయం తెరవకుండా ఉండడం సమంజసమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
జీవీఎంసీ 23 వ వార్డు సచివాలయం నెంబర్ 1086215 ఉదయం నుంచి తెరవక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.