తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులకు ఆహ్వానం
బోయినిపల్లి, జులై 05 (నిజం చెపుతాం);
ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం 4,5వ తరగతి చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులకు హైదరాబాద్ లోని హకీంపేట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ లో (2023-24 విద్యాసంత్సరం) 4వ మరియు 5వ తరగతుల అడ్మిషన్స్ కోసం 06-07-2023 రోజున ఉదయం 10 గంటలకు జెడ్పిహెచ్ఎస్ బోయినిపల్లి పాఠశాలలో విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
ఇట్టి ఎంపికలు మండల వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కొనసాగుతాయని, విద్యార్థులు సకాలంలో విచ్చేసి, ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరారు.
అర్హతలు: 4వ తరగతి కొరకు 8-9 సం.ల వయస్సు (01.09.2014 నుండి 31.08.2015) పుట్టినవారు, 5వ తరగతి కొరకు 9-10 సం.ల వయస్సు (01.09.2013నుండి 31.08.2014)గల పుట్టినవారు అర్హులు.
ఈ ఎంపిక కొరకు వచ్చే విద్యార్థులు వారి వెంట పుట్టిన తేదీ దృవీకరణ పత్రం తీసుకురావాలి.
వివరాల కొరకు సిహెచ్.సంపత్ రావు పి.డి, జెడ్పిహెచ్ఎస్ బోయినిపల్లి 9440639560 ఈ నంబర్ కు సంప్రదించగలరని మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు తెలిపారు.