విశాఖపట్నం జిల్లా పంచాయతీ కార్యదర్శిల పనితీరు సూపర్.
* నిధుల కొరత ఉన్నా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటున్న కార్యదర్శి లు.
* ప్రజల మన్ననలందుకుంటున్న పంచాయతీ కార్యదర్శి లు.
నూకేష్. నిజం న్యూస్ బ్యూరో
విశాఖపట్నం జిల్లాలో పంచాయతీ కార్యదర్శిల పనితీరు అద్భుతం గా ఉంది.నిజం న్యూస్ ప్రతినిధులు గ్రామాల్లో జరిగుతున్న అభివృద్ధి పనులపై వార్తలు సేకరించేదుకు విశాఖపట్నం జిల్లా పెందుర్తి,పద్మనాభం ఆనందపురం, భీమినిపట్నం మండలాలలో ఉన్న పంచాయతీ ల్లో పర్యటిస్తున్నప్పుడు పంచాయతీ కార్యదర్శి ల గురించి ఆయా పంచాయతీల ప్రజలు ఎంతో మంచిగా చెపుతుండడం విశేషం.
ఇంతలా ప్రజా మన్ననలందుకుంటున్న పంచాయతీ కార్యదర్శి ల గురించి నిజం న్యూస్ ప్రతినిధులు వివరాలు సేకరించగా పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి.చక్కని సమయపాలన పాటిస్తూ, పంచాయతీలలో నిధులు కొరత ఉన్నా సమస్యలు పరిష్కరించడంలో పంచాయతీ కార్యదర్శిలు ముందుంటున్నారు. పంచాయతీ ల్లో త్రాగునీటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు కార్యదర్శిలు.
అంతే కాకుండా పారిశుధ్యం మెరుగునకు, వీధి లైట్లు ఏర్పాటు లో ఎక్కడా రాజీ పడకుండా పనులు చేయిస్తున్నారు. నిత్యం పంచాయతీ లో పర్యటిస్తూ ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తూ ప్రజల మన్ననలందుకుంటున్నారు విశాఖపట్నం జిల్లా పంచాయతీ కార్యదర్శిలు. నిధుల కొరత వేధిస్తున్నా తమ తమ సొంత ఖర్చులతో సమస్యలు పరిష్కరిస్తూండడం విశేషం.
ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి సమస్యలున్నా పరిష్కారిస్తున్నారు వారు. ప్రజలందరికీ సకాలంలో ప్రభుత్వ పధకాలు అందేలా తమ వంతు కృషి చేస్తున్నారు పంచాయతీ కార్యదర్శిలు.
నిత్యం పంచాయతీ ల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న పంచాయతీ కార్యదర్శి లను ఇటు అధికారులు, అటు ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఎంత గానో అభినందిస్తున్నారు ఇంతటి ప్రజాభిమానం సంపాదించుకున్న విశాఖపట్నం జిల్లా పంచాయతీ కార్యదర్శిలందరికీ హేట్సప్.