ధరణి వెబ్సైట్ లో గిరిజనేతరుల ఆస్తులు నమోదు నిలిపివేయాలి-ఎయస్పి

వెంకటాపురం మండల కేంద్రంలో కొమరం భీం విగ్రహం కూ దండా వేసి ర్యాలీ ప్రారంభించడం జరిగినది అంబెడ్కర్ గారూ కు దండ వేసి అనంతరం మండల రెవెన్యూ తహశీల్ధార్ గారు కు ఏజన్సీ ప్రాంతంలో నూతన రెవెన్యూ చట్టం ధ్వారా ధరణి వెబ్సైట్ లో గిరిజనేతరుల భూములు, ఆస్తులు(I.R.S.)నమోదు చేయుటను నిలుపుదలచెయ్యాలి అని మెమోరాండం యివ్వడం జరిగింది. ములుగు జిల్లా ఉపా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నూతన గా తెచ్చిన రెవెన్యూ చట్టం భారత రాజ్యాంగం 5’6షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరుల ప్రాపర్టీ వారు నిర్మించుకున్నటువంటి ఇండ్లకు ఇంటి పన్ను తప్ప వరకు ఎటువంటి ఓనరు షిప్ పిఆర్&ఆర్డి శాఖ తెలంగాణ వారు చెప్పడం జరిగిదన్నారు. నైజం నవాబుల పరిపాలన కాలంలో అడవి తల్లీ ముద్దు బిడ్డలైన ఆదివాసీలకు బుక్కేడు బువ్వ కోసం ఆంగ్లేయుల కూ వ్యతిరేకంగా వారి దీపిడీ అణిచి వేత అరాచకాల కూ ఆదివాసీ హక్కుల కోసం, జల్ జంగిల్ జమీన్ అనే నినాదం తో గర్జించాలన్నారు నూతన రెవెన్యూ చట్టం రధ్దుఏజన్సీ లో చెయ్యక పోతే ఆదివాసీ లంతా ఉద్యమం బాట పట్టాలని అయన అన్నారు. ఏజన్సీలో ప్రాంతంలో సాధా బైనామా జి. ఓ నెం. 58’59లను రద్దు చెయ్యాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా ఉపా అధ్యక్షులు పార్షిక. సతీష్, ప్రధాన కార్యదర్శి రేగా. గణేష్, పూనెం. చంటి వెంకటాపురం మండల నాయకులు సర్వేష్, కృష్ణ, చంటి, ప్రతాప్, మహిళా నాయకులు బోదెబోయిన. స్వాతి, సుహాసిని, సరస్వతి, తిరుపతమ్మ తదితరులు అధిక సంఖ్యలో ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు.