Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లు ధ్వంసం

రాజన్న సిరిసిల్ల జిల్లా, జూలై 4 (నిజo చెపుతాo న్యూస్);

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారులు అధిక శబ్దాలు చేస్తూ, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ, పట్టణంలో తిరుగుతున్న టూ వీలర్లను గుర్తించి అట్టి వాహనాల సైలెన్సర్లను తీసి వేసి సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రోడ్డు రోలర్ తో ధ్వంసం చెసారు.

ఈ సందర్భంగా వారు మాాట్లాడుతూ అధిక శబ్ధాల వల్ల చిన్న పిల్లలు, ముసలి వాళ్లు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, వీటి వల్ల అనేక సార్లు ప్రమాదాలు జరిగాయని తెలిపారు.

ఈ విషయంపై ప్రజల నుండి అనేక సార్లు ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటిని తొలగించి ధ్వంసం చేసినట్లు తెలిపారు.

టూ వీలర్లకు ఎవరైనా అధిక శబ్ధాలను చేసే సైలెన్సర్లను బిగిస్తే వారిపౌ కేసులను నమోదు చేస్తామని తెలిపారు.