Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చిన్న పిల్లలతో బిక్షాటన , వెట్టి చాకిరీ చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి.

నిస్సహాయత లేని చిరునవ్వులే మన లక్ష్యం

ఆపరేషన్ ముస్కాన్- IX పోస్టర్ విడుదల

చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరికి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు. అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య.
మహబూ బాబాద్, జిల్లా ప్రతినిధి, జూలై 4, (నిజం న్యూస్):
జూలై 1 నుండి 31-07-2023 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ నిర్వహణకు సంబంధించి మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాలులో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ జో చెన్నయ్య చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంటు అధికారులు సిబ్బందితో కలిసి ముస్కాన్ టీమ్-IX పోస్టర్ లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు గొర్రెల, పశువుల కాపరులుగా, కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో పనిచేస్తూ పిల్లలు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న, ఇటుక బట్టీలలో, పౌల్ట్రీ ఫామ్ లలో ఉన్న, మరే ఇతర ప్రదేశాలలో తప్పిపోయిన వదిలివేయబడిన, పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుంది.

చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాట , వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జోగుల చెన్నయ్య అన్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేకంగా ఒక ఎస్ఐ నలుగురు పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు.

వీరితో పాటు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తారని, బాలకార్మికులు ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించడం జరుగుతుంది.

రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించే ముందు జిల్లా మెడికల్ అధికారులతో టెస్ట్ నిర్వహించాలని సూచించారు. వివిధ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కలిసి సమిష్టిగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి బాల కార్మికులు లేకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని సూచించారు.

బాలకార్మికుల లేకుండా సమిష్టిగా కృషి చేద్దామని, వారికి కావలసిన అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. బడి ఈడు కొచ్చిన పిల్లలు బడిలో ఉండాలని, చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి మొహం లో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు.

జిల్లాలో ఎవరైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్న, లేక వారితో బలవంతంగా పని చేయించిన, ఒంటరిగా బాధపడుతున్న బాలలను చూసినప్పుడు, ఆశ్రయం అవసరమైన బాలలను తప్పిపోయిన, వదిలివేయబడిన బాలలను చూసినప్పుడు, శారీరకంగా మానసిక లైంగిక దోపిడికి గురవుతున్న బాలలను, ఆర్థికంగా దోపిడీకి గురవుతున్న బాలకార్మికులను చూసినప్పుడు, హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు, 1098 లేదా డయల్ 100,కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.

సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అడిషనల్ ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సి డబ్ల్యూ సి చైర్మన్ , డిసిపిఓ, డి ఎల్ ఓ, విద్యా శాఖ ఏ. డి, చైల్డ్ హెల్ప్ లైన్ అధికారి, వైద్య అధికారి, సి డబ్ల్యూ సి సభ్యులు , పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.