Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సీడ్ ప్రాసింగ్ యూనిట్లను పరిశీలించిన అధికారులు

గరిడేపల్లి జూలై 04 నిజం చెపుతాం)*:మండల పరిధిలోని గడ్డిపల్లీ గ్రామము లో ఉన్న సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ల లోపల హుజూర్ నగర్ సిఐ రామలింగారెడ్డి, గరిడేపల్లి ఎస్సై వెంకట్ రెడ్డి మండల వ్యవసాయ అదికారి ప్రియతమ్ కుమార్ ఆధ్వర్యలో మంగళవారం తనిఖీలు నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా గ్రామములో ఉన్న సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నింటిని తనిఖీ చేసి, అందులో ఉన్న వరి విత్తనాల గవర్నమెంట్ నోటిఫై చేయని రకాలకు సంబంధించిన, తక్కువ నాణ్యత కలిగిన వరి రకాలను సీడ్ యాక్ట్ ప్రకారం సీజ్ చేసి, ఆయా విత్తనాల తయారీ షాప్ యజమానులపై కేస్ నమోదు చేసి ధర్యాప్తు చేయడం జరుగుతుందిని యస్ ఐ వెంకట్ రెడ్డి తెలిపారు

ఎటువంటి అనుమతి లేని, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని తెలియజేశారు..కానీ ఇందులోని ఆంతర్యం ఏమిటంటే గత పది రోజులలో రెండు సార్లు రైడ్ లు జరిగిన రైడ్లు జరిగే ముందర  సమాచారం ఇవ్వకపోవటం గమనించదగ్గ విషయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…