Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ స్టేట్ బ్యూరో జూలై 04

(నిజం చెపుతాం)

హైదరాబాద్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్నారు.

హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఘన స్వాగతం పలికారు.

సీఎం కేసీఆర్ వెంట.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్, శంభీపూర్ రాజు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనికుమార్, మేడ్చల్ కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తదితరులు ఉన్నారు

అదే సందర్భంలో.. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్న రాష్టప్రతి కి గవర్నర్ తమిళ సై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు స్వాగతం పలికారు